మేడారం జాతర… అప్రమత్తంగా వైద్య శాఖ
మేడారం జాతరుకు తరలివస్తున్న ప్రజలకు ఎటువంటి వైద్య పరమైన ఇబ్బంది లేకుండా వైద్యం అందిస్తోంది ప్రభుత్వం. నాలుగు రోజుల పాటు జరగనున్న జాతరలో ఉచిత వైద్యం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం. జిల్లా వైద్యశాఖ మరియు ఆరోగ్యశాఖ ములుగు బుదవారం రోజున వైద్య శాలలో దాదాపుగా 1000 మందికి పైగా మెరుగైన వైద్యం అందించడం జరిగింది. పరిస్థితి విషమంగా ఉన్నటువంటి వారిని తాడ్వాయి వైద్యశాల లేదా ములుగు వైద్య కళాశాలకు తరలించడం జరుగుతుంది. వివిధ రకాల ఇబ్బందులు, విష జ్వరాలు, ఫిట్స్, డయబెటిక్, యాక్సిడెంట్స్‌తోపాటుగా, దర్శనమార్గంలో నీరసంగా ఉన్నవారికి వైద్య సేవలు అందించడం జరుగుతుంది. మొదటి రోజు బుధవారం సుమారు వెయ్యి మంది కి పైగా భక్తులకు మాలేరియా , వైరల్ ఫీవర్, పీడ్స్ మొదలైన చికిత్స అందిచడం జరిగిందని, పరిస్థితి విషమంగా ఉన్నవారిని ములుగు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి పంపిచడం జరుగుతుందని అధికారులు చెప్పారు. అలాగే వేళలావారిగా 15 మంది వివిధ శాఖలకు సంబంధించిన డాక్టర్లు, 30 మంది సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. జాతరలో 33 మొబైల్ హెల్త్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ మధుసూదన్ తెలిపారు.