తెలంగాణలో దీనిపై నిషేధం
తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ మయోనైజ్ నిషేధించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నిర్ణయం ప్రకారం మయోనైజ్‌ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల బంజారాహిల్స్‌లో మోమోస్, మయోనైజ్ తిని ఒక మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాధితుల సంఖ్య 100కు చేరింది. గతంలో కూడా మయోనైజ్ కారణంగా ఫుడ్ పాయిజన్ కేసులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో మయోనైజ్ చాలా త్వరగా పాడయిపోతుందని, అందుకే దానిని నిలవచేసి, వాడడం విషతుల్యంగా తయారవుతుందని పేర్కొన్నారు. అందుకే కోడి గుడ్లతో తయారు చేసే మయోనైజ్‌ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు.

