భారీగా ఫారిన్ గంజాయి పట్టివేత
దేశ రాజధాని ఢిల్లీలో పారిన్ గంజాయి కలకలం రేగింది. ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు మరోసారి భారీగా ఫారిన్ గంజాయి పట్టుకున్నారు. రూ.47 కోట్ల విలువైన ఫారిన్ గంజాయిని సీజ్ చేశారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఐదుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. 5 ట్రాలీ బ్యాగుల్లో గంజాయిని నింపి తరలిస్తుండగా అనుమానం వచ్చి తనిఖీలు చేయగా ఈ భాగోతం వెలుగుచూసింది.నిందితుల్లో ఒకరు పారిపోతుండగా .. ఎయిర్ పోర్ట్ పోలీసులు వెంబడించి పట్టుకున్నారు.నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.