కో – ఆపరేటివ్ బ్యాంక్ లో భారీ దోపిడీ
కర్ణాటకలో వరుస దొంగతనాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నిన్న బీదర్ లో పట్టపగలు ఏటీఎం సిబ్బందిపై దుండగులు కాల్పు లు జరిపి రూ.93 లక్షలు దోచుకెళ్లిన ఘటన మరువక ముందే తాజాగా మంగళూరులో మరో భారీ దోపిడీ చోటు చేసుకుంది. ఇవాళ మంగళూరు కో-ఆప రేటివ్ బ్యాంక్ లో ఓ ముఠా దోపిడీకి పాల్పడింది. బ్యాంకులోకి చొరబడిన ఐదుగురు నిందితుల ముఠా తుపాకులు చూపించి సిబ్బందిని బెదిరించి రూ.15కోట్ల విలువైన బంగారం, 5 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. అయితే.. ఇది బిహార్ కు చెందిన ముఠా పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

