Home Page SliderInternationalNews Alert

రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం..22 మంది మృతి

చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్‌లోని లియోయాంగ్ అనే నగరంలో ఒక రెస్టారెంట్‌లో మధ్యాహ్నం  భారీ అగ్నిప్రమాదం  జరిగింది. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదంపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పందిస్తూ క్షతగాత్రులకు వెంటనే చికిత్స అందించాలని ఆదేశించారు. ఇటీవలే చైనాలో ఏప్రిల్ 9న హెబీ ప్రావిన్స్‌లో ఒక నర్సింగ్ హోంలో అతిపెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కూడా 20 మంది వృద్ధులు మృతి చెందారు. ఈ ఘటన కూడా అప్పట్లో దేశవ్యాప్తంగా విషాదం నింపింది. ఇప్పుడు ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.