crimeHome Page SliderNationalNews Alert

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్..22మంది మృతి

ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం మళ్లీ రక్తం చిందించింది. మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఈ ఘటనలో 22మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్, కాంకెర్ జిల్లాలలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్లలో ఒక జవాన్ కూడా అమరుడైనట్లు అధికారులు వెల్లడించారు. బీజాపూర్- దంతెవాడ జిల్లాల వద్ద గంగలూరు పరిధిలోని అండ్రి అడవులలో నక్సల్స్ ఉన్నట్లు సమాచారం రావడంతో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటికి 18 మంది మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. ఇక్కడ భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కాంకెర్ జిల్లాలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.