ఇంజనీరింగ్ కోర్సుల్లో భారీ మార్పులు
ఇంజనీరింగ్ పూర్తైనా విద్యార్తుల్లో కేవలం 12 శాతం మంది మాత్రమే స్కిల్డ్ జాబ్స్ పొందుతున్నారు. మిగత వారు పొందడం లేదు. దీనికి కారణం ఏంటి? ఎక్కడ లోపం జరుగుతుంది. అందరికి ఓకే తరగతిలో పాఠాలు బోధిస్తున్నా… కేవలం అంతా తక్కువ మందికి మాత్రమే జాబ్స్ రావడం ఏంటి అనే పలు విషయాల గురించి ఆలోచించిన విద్యా సంస్థలు 2022-23 విద్యాసంవత్సరాల్లో భారీ మార్పులు తీసుకోస్తున్నారు. జాబ్స్‌కి అవసరమయ్యే విధంగా పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఈ విధానంలో భాగంగా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలోనే ప్రముఖ సంస్థల్లో విద్యార్ధులను ప్రాజెక్ట్ వర్క్‌లలో భాగం చేసే విధంగా కసరత్తులు చేస్తున్నారు. వీటిని ఆధారం చేసుకుని మార్క్స్ ఇస్తామని సూచించారు. అదే విధంగా ఆఖరి సంవత్సరాల్లో కూడా మరో ప్రాజెక్టు వర్క్ చేయాల్సి ఉంటుందని… దీనిలోను సంబంధిత సంస్థ నుండి ధృవీకరణ పొందాలనే షరతులు పెట్టారు. ఇటువంటి తరహా విధానం ద్వారా విద్యార్ధులకు రియల్ టైం ఎక్స్‌పిరియన్స్ లభించడమే కాకుండా… ఎక్కువ శాతం మంది ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఈ విధానం సహాయపడుతోందని విద్యాసంస్ధలు భావిస్తున్నారు.

