జీవితంలో ఈ 45 నిమిషాలు వెలకట్టలేనివి
ప్రధాని మోదీతో కేరళ సూపర్ స్టార్ భేటీ
ప్రధానితో సమావేశం తర్వాత కామెంట్స్
నా జీవితంలో ఇవే అరుదైన క్షణాలు
ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఉన్ని ముకుందన్ ఉద్వేగం
ప్రధాని మోదీతో తన భేటీ జీవితంలో మరచిపోలేని మధురానుభూతిని కలిగించిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని పంచుకున్నాడు కేరళ నటుడు ఉన్ని ముకుందన్. ప్రధాని కేరళ పర్యటన సందర్భంగా ఆయనతో కలిసే అవకాశం లభించడం తన అదృష్టమని పేర్కొన్నాడు. చిన్న నాటి నుంచి నరేంద్ర మోదీని కలవాలని, ఆయనతో గుజరాతీలో మాట్లాడాలని కలలు కన్నట్టు చెప్పాడు. సోమవారం రాత్రి కొచ్చిలో మోదీతో 45 నిమిషాల పాటు వ్యక్తిగతంగా కలిసే అవకాశం వచ్చినప్పుడు, తన ఆనందానికి అవధుల్లేవన్నాడు. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలుకోలేకపోయానన్నాడు. సోషల్ మీడియాలో ఇప్పటి వరకు తాను పెట్టిన అన్ని పోస్టుల కంటే ఇది ఇది మోస్ట్ ఎలక్ట్రిఫైయింగ్ పోస్ట్ అని రాసుకొచ్చాడు.
గుజరాత్‌లో 20 ఏళ్లకు పైగా తాను నివసించానని, 14 ఏళ్ల నుంచి మోదీని చూస్తున్నానని గుర్తు చేసుకున్నాడు. “ధన్యవాదాలు సార్, మిమ్మల్ని 14 ఏళ్ల వయసులో చాలా దూరంగా చూసినప్పటి, నేడు కలవడం వరకు ఊహించుకోలేకపోతున్నా!” అని ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. మిమ్మల్ని కలవాలని, గుజరాతీలో మాట్లాడాలని ఒక పెద్ద కల నెరవేరిందంటూ రాసుకొచ్చాడు. మీ సమయం 45 నిమిషాలు, నా జీవితంలో అత్యుత్తమ 45 నిమిషాలు!” అని పేర్కొన్నాడు. ప్రధాన మంత్రి తనతో చెప్పిన మాటలను ఎప్పటికీ మరచిపోలేనని, ప్రతి సలహాను ఆచరణలో పెట్టడంతోపాటు అమలు చేస్తానని ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నాడు.