మక్తల్: బీజేపీ జలంధర్ రెడ్డి, రతన్ పాండ్ రెడ్డి తరఫున ప్రచారంలో-ఈటల
మక్తల్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి జలంధర్ రెడ్డి, నారాయణపేట బీజేపీ అభ్యర్థి రతన్ పాండ్ రెడ్డి తరఫున మక్తల్ సభలో మాట్లాడిన ఈటల రాజేందర్.
కేసీఆర్ దళితులకు మూడు ఎకరాలు ఇవ్వలేదు సరికదా ఎప్పుడో ఇచ్చిన అసైన్డ్ భూములు లాక్కుంటున్నాడు. బీజేపీ వస్తే ఒక్క ఎకరం కూడా తీసుకోము. దళితబంధు పేరుతో దళితులను కేసీఆర్ దగా చేస్తున్నారు. గొల్ల కురుమలు డిడిలు కట్టారు కాని గొర్రెలు ఇవ్వడం లేదు.
కేసీఆర్ ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి.. ఓటు బీజేపీకి వేయండి. అటుకులు బుక్కి ఉపాసమున్న కేసీఆర్‌కి ఇన్ని కోట్లు ఎలా వచ్చాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం మా మొదటి ప్రాధాన్యత. 10 లక్షల లోపు ఉచిత వైద్యం అందిస్తాం. పేదలకు నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తాం. మన సొమ్ము పక్క రాష్రాల వారికి ఇవ్వడానికి నీ అబ్బ జాగీరు కాదు కేసీఆర్. ఇక్కడ చనిపోయిన రైతులను ఆదుకొనే సోయి లేని నువ్వు అబ్ కీ సర్కార్ కిసాన్ సర్కార్ అని చెప్పుకుంటున్నావు. 3,100 రూపాయలు క్వింటాల్ వరికి మద్దతు ధర అందిస్తాం. ఒక్క ఎకరానికి 25 వేల రూపాయల లాభం వస్తుంది. వ్యవసాయ పనిముట్లకు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తాం. కాంగ్రెస్, టీడీపీ, BRS ఒక్కసారి కూడా బిసిని ముఖ్యమంత్రిని చెయ్యలేదు. బీసీని సీఎం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. బీజేపీ వస్తే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తాం. జిఓ నెం.69 ఇచ్చి ఎత్తిపోతల పథకం మర్చిపోయారు. బీజేపీ వస్తే పూర్తి చేస్తాం. మాదసి కురుమలను ఎస్సీలలో చేరుస్తా అని మాట ఇచ్చి నెరవేర్చలేదు. మేము వస్తే వారి సమస్య తీరుస్తాం.

