Home Page SliderNational

ఢిల్లీకి మహారాష్ట్ర పంచాయితీ

మహారాష్ట్ర రాజకీయ పంచాయితీ ఢిల్లీకి చేరుకుంది. ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది సస్పెన్స్‌గా మారింది. మహాయుతి కూటమిలో ఎవరు సీఎం కావాలనే నిర్ణయం తీసుకోవడానికి బీజేపీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా చేయడానికి మద్దతునిస్తున్నానని అజిత్ పవార్ వర్గం ఇప్పటికే వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల ఫార్ములా అమలు పరుస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీదే కూటమిలో అతిపెద్ద పార్టీ అని ఫడ్నవీస్ వర్గం వాదిస్తోంది. షిండే వర్గం వాదన ప్రకారం రెండున్నరేళ్ల షిండే పాలనకు ప్రజలు మెచ్చి విజయాన్ని కట్టబెట్టారని అంటున్నారు. సీనియారిటీ ప్రకారం అజిత్ పవార్‌కి ఇవ్వాలని పార్టీ పట్టుబడుతోంది. ఈ మొత్తం కూటమిలో బీజేపీకి 132 మంది ఎమ్మెల్యేలు, షిండేకు 57 మంది, అజిత్‌కు 41 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అందుకే ఢిల్లీ పెద్దల నిర్ణయాన్ని బట్టి మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటవుతుందని సమాచారం.