ఆటో డ్రైవర్ల మహాధర్నా
ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ సర్కార్ వల్ల ఆటో-రవాణా కార్మికులు తీవ్రంగా నష్టపోయారని ఆయా యూనియన్ సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు హైద్రాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద మంగళవారం మహాధర్నాకు దిగారు.ఈ కార్యక్రమానికి ఉభయ కమ్యునిస్టు పార్టీ అనుబంధ సంఘాల నాయకులు హాజరయ్యారు.మహాలక్ష్మీ పథకం వల్ల తాము అన్ని విధాలుగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ తమకు ఏడాదికి రూ. 15వేలు ఆర్ధిక సాయం అందించాలని కోరారు. లేని పక్షంలో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

