లోకకళ్యాణం కోసం ఈ యాత్ర చేపట్టినట్లు మాధవాచారి స్వామీజీ..
కందకుర్తి: గోదావరి పరీవాహక ప్రదక్షిణ (పరిక్రమ)లో భాగంగా ఈ నెల 1 నుండి అయోధ్యకు చెందిన 200 మంది స్వామీజీలు చేపట్టిన యాత్ర సోమవారం కందకుర్తికి చేరుకోగా వారికి అయోధ్య కందకుర్తి ఆశ్రమ పీఠాధిపతి సీతారాం త్యాగి మహరాజ్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, స్థానిక భక్తులు ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు ఇచ్చారు. గోదావరితో పాటు నదీ పరీవాహక ప్రాంతంలోని రామాలయం, శివాలయం, వెంకటేశ్వర మందిరాన్ని వారు దర్శించుకున్నారు. మంగళ్‌పీఠ్ పీఠాధిపతి మాధవాచారి ఆధ్వర్యంలో యాత్ర ఈ నెల 14న గోదావరి జన్మస్థలమైన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్‌కు చేరుకోనుంది. లోకకళ్యాణం కోసం ఈ యాత్ర చేపట్టినట్లు మాధవాచారి స్వామీజీ తెలిపారు.

