Home Page SliderTelangana

తెలంగాణకు భారీ పెట్టుబడులతో రానున్న ‘లులూ గ్రూప్’

తెలంగాణ రాష్ట్రం పెట్టుబడిదారుల స్వర్గంగా మారింది. భారీ పెట్టుబడులతో మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. ఏకంగా 3, 500 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెలంగాణలో పెడుతున్నట్లు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ వెల్లడించారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన తన పెట్టుబడుల వివరాలను తెలియజేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఎక్స్‌పోర్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఇవే కాకుండా హైదరాబాద్‌లో 300 కోట్ల రూపాయలతో షాపింగ్ మాల్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 80 శాతం మాల్ పనులు పూర్తయ్యాయని,  దీనిని ఆగస్టు లేదా సెప్టెంబరులో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. దీనితో తెలంగాణాలో పర్యాటకం అభివృద్ధి చెందుతుందని, హైదరాబాద్‌లో అతిపెద్ద షాపింగ్ మాల్ అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు జరుగుతోందని దీనితో తెలంగాణకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుందని, అన్ని రంగాలలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.