NationalNewsNews Alert

శ్రీకృష్ణ భక్తులకు లక్కీఛాన్స్ -లక్షలకొద్దీ ప్రైజ్ మనీ

నిన్న శ్రావణ శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు దేశ ప్రజలందరూ చాలా ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలలో వెన్నదొంగ అల్లరికి అద్దం పట్టే ఉట్టి కొట్టే ఆట చాలా ముఖ్యమైనదని చెప్పవచ్చు. ఈ వేడుకలు మహారాష్ట్రలో ప్రతీ సంవత్సరం  చాలా సందడిగా జరుగుతాయి. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఈ ఉత్సవాన్ని సరిగ్గా జరుపుకోలేకపోయిన భక్తులు, ఈ సారి ఏ నిషేధాజ్ఞలూ లేకపోవడంతో చాలా వైభవంగా జరుపుకున్నారు. DHAHI HANDI అనే పేరుతో ఉట్టి పండుగను జరుపుకుంటారు. ఈసారి మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఆటకు అడ్వెంచర్ స్పోర్ట్స్ హోదాను కల్పిస్తోంది. ఈ పోటీలో పాల్గొనే యువకులను గోవిందులు అని పిలుస్తారు.

 ఈసారి ఆట ఆడేవాళ్లకు గోల్డెన్ ఛాన్స్ దక్కింది. ఈ ఈవెంట్‌లో విజేతకు అడ్వెంచర్ స్పోర్ట్స్ ట్వాగ్, స్పోర్ట్స్ కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం దొరుకుతుంది. అలాగే దహీ హండీలో మానవ పిరమిడ్‌ను ఏర్పాటు చేసినప్పుడు ఎవరికైనా గాయాలు తగిలినా వారికి పరిహారాలు కూడా ఇస్తున్నారు. అంతే కాదండోయ్.. కళ్లు చెదిరే క్యాష్ ప్రైజ్‌లు కూడా నిర్వాహకులు భారీగా ప్రకటిస్తున్నారు. దీనిలో గెలిచిన వారికి 1.11 లక్షల నుండి 55 లక్షల రూపాయల వరకూ ప్రైజ్ మనీని వివిధ రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్నాయి. విజేత అయిన జట్టుకు స్పెయిన్ దేశానికి ట్రిప్ కూడా వెళ్లే అవకాశం లభిస్తోంది. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన నిర్వహిస్తున్న దహీ హండి ఈవెంట్‌కు మొత్తం 55 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించింది. ఇంకా స్థానిక సంస్థ స్వామి ప్రతిష్టాన్ విజేత జట్టుకు 51 లక్షల ప్రైజ్ మనీని ప్రకటించింది. ఈ ఉత్సవాలు సాఫీగా జరగడానికి ముంబై పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే వైద్యసేవలు అందించేందుకు వైద్యులు, అంబులెన్సులు కూడా రెడీగా పెట్టారు. ఇటు సరదాగా ఆటతో పాటు లక్షల పారితోషకాన్ని అందుకొనే ఈ మహత్తర అవకాశం చాలా బాగుంది కదా..