బంగాళాఖాతంలో అల్పపీడనం..నేడు, రేపు భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం రేవు ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశాలకు చేరువలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడనుంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది

నిన్న ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాం ఉంది. రేపు విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాతో పాటు విజయనగరం జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న మూడు రోజుల పాటు కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 70 కి.మీ వేగంగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని IMD తెలిపింది.

