HealthHome Page SliderInternationalLifestyleNews Alert

మైక్రో ప్లాస్టిక్ కు చెక్ పెట్టండిలా..

జీవనశైలి మార్పులతో, కొద్దిపాటి జాగ్రత్తలతో ఇంటా బయటా పెరిగిపోతున్న మైక్రోప్లాస్టిక్ ప్రభావానికి చెక్ పెట్టడం సాధ్యమే.

  • వీలైనంత వరకూ కాటన్ దుస్తులనే ధరించాలి.
  • టాయిలెట్లు, టైల్స్ శుభ్రం చేయడానికి మైక్రోప్లాస్టిక్ తో తయారైన రసాయనాలకు బదులుగా… వెనిగర్, నిమ్మరసం కలిపిన నీటిని వాడినా మంచి ఫలితమే ఉంటుంది.
  • ప్యాకేజ్డ్ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను సాధ్యమైనంత దూరం ఉంచాలి.
  • ప్లాస్టిక్ డబ్బాలకు ప్రత్యామ్నాయం వెతుక్కోవాలని ఫుడ్ డెలివరీ సంస్థలకు ఫీడ్ బ్యాక్ రూపంలో సూచించాలి.
    మైక్రోవేవ్ ఓవెన్లలో ఆహారాన్ని వేడి చేయడానికి గాజు లేదా పింగాణీ పాత్రల్నే ఎంచుకోవాలి. ఇంటికి అవసరమైన కూరగాయల్ని పెరట్లోనో, కుండీల్లోనో పండించుకోవడం ఉత్తమం.
    సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిత్య జీవితంలోంచి పూర్తిగా బహిష్కరించాలి.
  • సింథటిక్ కార్పెట్లూ, పరుపులూ వాడకపోవడం మంచిది.
  • దశలవారీగా అయినా… వంటింటి అవసరాలకు గ్లాసు, పింగాణీ, మట్టి, స్టెయిన్లెస్ స్టీలు పాత్రల్ని సమకూర్చుకోవాలి.
  • ప్లాస్టిక్ కుర్చీలూ, టేబుళ్ల స్థానంలో కలప, వెదురు ఫర్నిచర్ను ఉపయోగించడం ఉత్తమం.
  • పిల్లలకు ప్లాస్టిక్ ఆట వస్తువుల్ని కొనివ్వకూడదు. బహుమతిగానూ ఇవ్వకూడదు.
  • విందులూ వినోదాల్లో ప్లాస్టిక్ పళ్లాలూ, చెంచాలూ, కప్పులూ, గ్లాసులూ దూరం ఉంచాలి. వాషింగ్ మెషీన్లో ఒకట్రెండు బట్టలు వేయకుండా, పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవాలి. దీనివల్ల మైక్రోప్లాస్టిక్ విడుదల కొంతమేర తగ్గుతుందని అంచనా.
  • ప్లాస్టిక్ మైక్రోబీడ్స్ ఉన్న సౌందర్య సాధనాల్ని దూరం పెట్టాలి. ఆయా ఉత్పత్తుల అట్టమీద ఆ ప్రస్తావన ఉంటుంది. ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల వీలైనంతగా మైక్రో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించవచ్చు.