“దేశ ప్రజల శ్రేయస్సు కోసం విభేదాలను పక్కన పెడదాం”:మల్లి ఖార్జున ఖర్గే
దేశంలో కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాల కూటమి మరోసారి బెంగుళూరులో భేటి నిర్వహించింది. అయితే ఈ విపక్షాల భేటి రెండోరోజు కొనసాగుతోంది. కాగా ఈ భేటిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..రాష్ట్రస్థాయిలో మన మధ్య ఎన్నో విభేదాల ఉండొచ్చు..కానీ అవి ఏమి అంత పెద్దవి కావన్నారు. దేశంలోని మధ్యతరగతి,యువత,పేదలు,దళితులు,మైనారిటీల హక్కుల కోసం వాటిని పక్కనపెడదామని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇక్కడ 26 పార్టీల నేతలం ఉన్నామన్నారు. అయితే దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో మన ప్రభుత్వాలే ఉన్నాయని తెలిపారు. దీంతో ఈసారి బీజేపీకి 303 సీట్లు రావడం కష్టమే అన్నారు. అందుకే బీజేపీ పాత మిత్రులను కలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది అని మల్లి ఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.