ఇన్ఫోసిస్‌పై ప్రముఖ ఐటీ కంపెనీ దొంగతనం ఆరోపణలు
ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కంపెనీపై పెద్దఎత్తున ఆరోపణలు చేస్తోంది మరో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్. తమ హెల్త్ కేర్ సాఫ్ట్‌వేర్ ట్రెజెట్టో నుండి వాణిజ్య రహస్యాలని ఇన్ఫోసిస్ దొంగిలించిందని విమర్శలు కురిపిస్తోంది. నాన్ డిస్‌క్లోజర్ అండ్ యాక్సెస్ అగ్రిమెంట్ ద్వారా ట్రైజెట్టో వాణిజ్య రహస్యాలను దుర్వినియోగం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిందంటూ ఆరోపించింది. ఈ విషయంపై ఆడిట్ జరపడానికి కూడా ఇన్ఫోసిస్ నిరాకరించిందని కాగ్నిజెంట్ తెలిపింది. ఈ విషయంపై 2024 ఆగస్టులో అమెరికా కోర్టులో దావా వేసింది కాగ్నిజెంట్. అయితే ఈ ఆరోపణలు ఇన్పోసిస్ తిరస్కరించింది. తమ వద్ద 2022 అక్టోబర్ వరకూ ఇన్ఫోసిస్ అధ్యక్షుడిగా ఉన్న రవికుమార్, మరుసటి జనవరిలోనే కాగ్నిజెంట్ సీఈఓగా చేరారని ఆయన హెల్త్ కేర్ సాఫ్ట్ వేర్ విడుదల చేయడాన్ని ఆలస్యం చేశారని ప్రతి ఆరోపణలు చేసింది. పైగా కాగ్నిజెంట్ హెల్త్‌కేర్ సొల్యూషన్స్ బహిరంగంగా ఉన్నాయని తెలిపింది. ఈ రెండు సంస్థల మధ్య ఆరోగ్య సంరక్షణ సేవల రంగంలో పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే.