Home Page SliderNews AlertTelangana

సిగ్నల్‌ ఫ్రీగా ఎల్బీనగర్‌ జంక్షన్‌.. నేడు మరో ఫ్లైఓవర్‌ ప్రారంభం

ఇక నుంచి సిగ్నల్‌ ఫ్రీగా ఎల్బీనగర్‌ జంక్షన్‌ అందుబాటులోకి రానుంది. శనివారం సాయంత్రం నుంచి మరో ఫ్లైఓవర్‌ ప్రారంభం కానుంది. వనస్థలిపురం – దిల్‌సుఖ్‌నగర్‌ మార్గంలో ఎల్బీనగర్‌ జంక్షన్‌ వద్ద నిర్మించిన పై వంతెనను మంత్రి కేటీఆర్‌ సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చే వాహనాలకు ఇబ్బంది లేకుండా డైరెక్ట్‌గా ముందుకు సాగిపోవచ్చు. ఎల్బీనగర్‌ జంక్షన్‌ సిగ్నల్‌ ఫ్రీగా మార్చేందుకు 32 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ వివరాలను మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.