జడ్జిని కొట్టిన లాయర్లు..పోలీసుల లాఠీఛార్జ్
ఘజియాబాద్‌లో కోర్టులో ఒక విచిత్రం జరిగింది. ఏకంగా జడ్జిపైనే కొట్లాటకు దిగారు లాయర్లు. బార్ అసోసియేషన్ అధికారికి సంబంధించిన కేసులో బెయిల్ ఇవ్వకపోవడంతో జడ్జిపై వాగ్వాదానికి దిగారు లాయర్లు. అయితే జడ్జి ప్రతిఘటించడంతో జడ్జి చాంబర్‌ను చుట్టుముట్టి దాడికి ప్రయత్నించారు. దీనితో తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుంటూ బీభత్సం సృష్టించారు. జడ్జి పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు లాయర్లపై లాఠీఛార్జ్ ఉపయోగించి చెదరగొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

