తెలంగాణాలోని ఆంద్రావాళ్ల భూముల కబ్జా
ఎడాపెడా….ఏం చేసినా…అడిగేదెవడ్రా నా ఇష్టం….అని సుద్దాల అశోక్ తేజ ఓ జానపద గేయంలో తెలంగాణ సమాజాన్ని ప్రతిబింబించేలా ఓ ఇరవై ఏళ్ల కిందటే పాట రాశాడు.ఆ తర్వాత దాన్ని ఓ సినిమాలోనూ వాడారు.ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో ఆంధ్రా వాళ్లంతా ఈ పాటను నిత్యం పాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.హైడ్రా పేరుతో కూలగొడుతున్న అధిక శాతం భవనాలు,నిర్మాణాలలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారివే అధికంగా ఉంటున్నాయి.అంతే కాదు భూములు కూడా లాగేసుకుంటున్నారు.పనిలో పనిగా అసలు ఇక్కడ భూములు కొనుగోలు చేసి ఖాళీగా ఉంచి …నిర్మాణాలు కట్టని వారికి భూములెందుకని ప్రశ్నించేలా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాళ్ల భూములను నిలువునా దోచేస్తున్నారు.ఇది రేవంత్ రెడ్డికి తెలిసి జరుగుతుందా…తెలియకుండా జరుగుతుందా అనే విషయం పక్కన పెడితే…కబ్జాకు పాల్పడుతున్న వారు మాత్రం రేవంత్ మనుషులే.ఇది నిజం అని చెప్పడానికి ఏపికి చెందిన టిటిడి మాజీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి భూములను గత రెండు రోజుల కిందట సీఎం మనుషులు ఆక్రమించుకున్నారు. ఒకటి రెండు కాదు ఏకంగా రూ. 200కోట్ల విలువైన ఫెన్సింగ్ వేసిన స్థలాలు,భూములను ఆక్రమించుకున్నారు.దీంతో వై.వి సుబ్బారెడ్డి ఆగమేఘాల మీద హైద్రాబాద్ వచ్చి సమస్యను పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

