Home Page SliderTelangana

లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు నీళ్లివ్వలే.. కాళేశ్వరం సందర్శించిన సీఎం రేవంత్, మంత్రుల బృందం

సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా మంత్రుల బృందం ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించింది. ప్రాజెక్టు తాజా పరిస్థితిపై చీఫ్ ఇంజినీర్ సుధాకర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వగా.. మొత్తం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్ష కోట్లు ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా నీరందలేదని అధికారులే వివరిస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డలో 85 పిల్లర్లున్నాయని 8 బ్లాకులున్నాయని, 7వ బ్లాక్ కుంగిందన్నారు.

బ్యారెజ్ ఎలా కుంగిందన్నదానిపై రూట్ కాజ్ ఏంటన్నది త్వరలోనే తేలుతుందన్నారు. ఎందువల్ల పిల్లర్లు కూలాయన్నది తేలాల్సి ఉందన్నారు. నిర్మాణంలో నాణ్యత లోపం కూడా ఉందని కేంద్ర బృందం చెప్పిందన్నారు సీఎం. కేసీఆర్ మాత్రం కోటి ఎకరాలకు నీళ్లిచ్చామని చెప్తారని రేవంత్ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపం ఉందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందన్నారు సీఎం. 2020-21లోనే సమస్య ఉందని ఇంజినీర్లు గుర్తించినా ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎం చెప్పారు. సమస్యను చక్కదిద్దకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. తాజాగా గత ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని ఇంజినీర్లు గుర్తించారని చెప్పారు.