గన్ గురిపెట్టి లేడీ కానిస్టేబుల్‌పై అత్యాచారం
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లిలో దారుణం జరిగింది. గన్ గురిపెట్టి ఒక లేడీ కానిస్టేబుల్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక ఎస్సై. ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక గెస్ట్‌హౌస్‌లో ఈ ఘటన జరిగినట్లు ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సైని అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ సంఘటన జూన్ 15న జరిగింది. కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఒక ఎస్సై, అదే పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్‌ను రివాల్వర్‌తో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె కంప్లైంటు చేశారు. గతంలో కూడా అనేకసార్లు వేధింపులకు పాల్పడినట్లు ఈ ఫిర్యాదులో తెలిపారు. ఆ ఎస్సైపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశామని ఈ ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని పోలీస్ వర్గాలు తెలియజేశారు.