Home Page Slider

మరో ORR ఇంటర్ ఛేంజ్ ప్రారంభించిన కేటీఆర్

హైదరాబాద్‌కు మరో ఓ ఆర్ ఆర్ ఇంటర్ ఛేంజ్ రాబోతోంది. నార్సింగి వద్ద ఏర్పాటు చేసిన ఆర్ ఆర్ ఇంటర్ ఛేంజ్‌ను మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించారు. ప్రయాణికులకు సౌకర్యార్థం నార్సింగి, కోకాపేట్, మల్లంపేట ప్రాంతాలలో కొత్త ఇంటర్ ఛేంజ్ ఏర్పాట్లు చేయనున్నట్లు HMDA గతంలో ప్రకటించింది. దీనిలో భాగంగానే నేడు నార్సింగి ఇంటర్ ఛేంజ్‌ను ప్రారంభించారు. దీని నిర్మాణానికి 29.50 కోట్ల రూపాయలు వెచ్చించారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం జరిగింది. దీనిపై మొత్తం 19 ఇంటర్ ఛేంజ్‌లు ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు ఈ సంఖ్య 20కి పెరిగింది. కోకాపేట, మల్లంపేట కూడా పూర్తయితే ఈ సంఖ్య 22కి చేరుతుంది.