కృష్ణంరాజు చనిపోతే… షూటింగ్‌లు నిర్వహిస్తారా? ఆర్జీవీ ఫైర్
కృష్ణంరాజు మరణించిన వార్త అందరికి తెలిసిందే. ఈ వార్త అటు బంధువులతో పాటుగా ఇటు సీనీ వరిశ్రమను కూడా ఎంతగానో కలిచివేసింది. ఆయన మరణవార్తతో అందరు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం షూటింగ్‌లు చేస్తున్నారు అంటూ ఆర్జీవీ మండిపడ్డారు. అంత పెద్ద స్టార్ చనిపోయినా… ఏమీ పట్టనట్టు టాలీవుడ్‌లో షూటింగ్‌లు జరగడం పై అంసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు రోజులు షూటింగ్‌లు ఆపలేరా అని ప్రశ్నించారు. ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుందని నెలరోజులు షూటింగ్ ఆపేశారు కదా..ఇప్పుడు ఇంతా పెద్ద విషాదం జరిగిన షూటింగ్‌లు ఆపరా ? అంటూ దుయ్యబట్టారు. ఇదేనా మీరు కృష్ణంరాజు మరణానికి ఇచ్చే విలువ అని ఆర్జీవీ ఫైర్ అయ్యారు.


 
							 
							