News Alert

అమిత్ షాతో భేటీ కానున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Share with

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి… కాసేపట్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. నియోజకవర్గంలో ఇటీవల సంభవించిన వరద నష్టం… వివరాలను కేంద్ర మంత్రికి వెంకట్ రెడ్డి అందించనున్నారు. పెద్ద మనసుతో… వరద సాయం సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నారు. అయితే వెంకట్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో వెంకట్ రెడ్డి.. షాతో భేటీ కావడంతో కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ ఎక్కువ అవుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పార్టీ మారుతున్నారంటూ కొన్ని మీడియాల్లో వార్తలు గొప్పుమన్నాయ్. అయితే వాటన్నిటిని ఆయన ఖండించారు. తాజాగా… వరద సాయం కోరడం కోసమే కలుస్తున్నానని వివరణ ఇచ్చారు. పార్టీ నిర్వహిస్తున్న మునుగోడు సభకు హాజరు కానని ఇప్పటికే ఆయన క్లారిటీ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత మాత్రమే మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తానని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోకి చెరుకు సుధాకర్ చేర్చుకోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరు బాలేదంటూ బాహాటంగా విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖం కూడా చూడబోనంటూ చెప్పారు. దీంతో గాంధీభవన్లో రకరకాల వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.