Home Page SliderNationalNews Alert

కోలీవుడ్‌ నటుడి ఇంట తీవ్ర విషాదం

కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి సుబ్రమణ్యం అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అజిత్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు అర్పించారు. ఈ రోజు సాయంత్రం చెన్నైలో బీసెంట్‌ నగర్‌లోని శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.