కిరణ్ రాయల్ కైఫ్ అరెస్ట్
కిరణ్ రాయల్ కేసులో ప్రధాన బాధితురాలిగా ఉన్న లక్ష్మీ ని రాజస్థాన్ పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య సోమవారం అరెస్ట్ చేశారు.తిరుపతిలో ఆమె నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న లక్ష్మీని జైపూర్ మహిళా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆమె ఆన్ లైన్ ఛీటింగ్ కేసులో నిందితురాలిగా ఉన్నారని పేర్కొంటూ నోటీసులు ఇచ్చి మరీ లక్ష్మీని అదుపులోకి తీసుకున్నారు.ఇదంతా కిరణ్ రాయల్ తనపై చేస్తున్న కుట్రని లక్ష్మీ వాపోయారు. తనకు డబ్బులు ఇవ్వాలని మీడియా ముఖంగా కోరినందుకే ఇలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా…రెండు రోజుల కిందటే లక్ష్మీని అరెస్ట్ చేస్తారని కిరణ్ రాయల్ చెప్పడం గమనార్హం.