Home Page SliderTelangana

కల్లు సీసాలో కట్ల పాము .. దుకాణం ధ్వంసం..

కల్లు సీసాలో కట్ల పాము కలకలం రేపింది. కనుమ పండుగను ముగించుకొని ఓ మందుబాబు కల్లు దుకాణానికి వెళ్లి ఒక పెగ్ వేద్దామని ఒక సీసా కొని రెండు గుటకలు వేయగా నోట్లోకి చనిపోయిన 6 ఇంచుల పొడవున్న కట్ల పాము బయట పడింది. ఒక్కసారిగా ఆ వ్యక్తి షాక్ కి గురై సదరు కల్లు ఉమ్మివేయగా పాము దర్శనమిచ్చింది. ఈ షాకింగ్ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. దీనిపై కల్లు దుకాణం యజమానిని ప్రశ్నించగా నోరు మెదపలేదు. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు కల్లు దుకాణాన్ని ధ్వంసం చేశారు. కల్తీ కల్లు తయారు చేస్తున్న యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను కోరారు.