పుష్ప2 పై కీలక అప్‌డేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక నటించిన పుష్ప2 చిత్రం కోసం అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. డైరక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంపై నేడు చిత్ర యూనిట్ కీలక అప్‌డేట్ రిలీజ్ చేసింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు తెలిపారు. గతంలో డిసెంబర్ 6న రిలీజ్ చేయాలనుకున్నా, ఒకరోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతోందని పేర్కొన్నారు. అంతేకాదు పుష్ప 3 కూడా ఉంటుందంటూ ఊరించారు. ‘పుష్ప ది రైజ్’ చిత్రం భారీ సంచలనం సృష్టించి, అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డును తెచ్చిపెట్టింది. అందుకే దీనికి సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప ది రూల్’ ( పుష్ప 2) చిత్రం కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

