నటులపై బెట్టింగ్ యాప్‌ల కేసులో కీలక మలుపు
తెలంగాణలో బెట్టింగ్ యాప్‌లపై వరుస కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. పలువురు సినీ ప్రముఖులు, యూట్యూబర్లు సహా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కూడా కేసు నమోదయ్యింది. అయితే ఈ కేసులో చర్యలు తీసుకునేముందు న్యాయసలహా పాటించాలని నిర్ణయించుకున్నారు పోలీసులు. రానా, విజయదేవరకొండ, ప్రకాశ్ రాజ్ వంటి సెలబ్రెటీలు నిందితుల జాబితాలో ఉండడంతో ముందుగా వారికి నోటీసులిచ్చి, న్యాయసలహా ప్రకారం విచారించాలనే నిర్ణయానికి వచ్చారు. తొలుత బెట్టింగ్‌కు మూలకారణమైన ఈ యాప్‌ల నిర్వాహకులను విచారించి వారు నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే వారిని ముందుగా విచారిస్తారు. తర్వాతే తదుపరి చర్యలుంటాయి. ఇప్పటి వరకూ 19 యాప్‌లలో 5 యాప్‌ల వివరాలు మాత్రమే గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.