‘చమ్కీల అంగీలేసి’ సాంగ్‌కు కీర్తి సురేశ్ తల్లి మేనక స్టెప్పులు
న్యాచురల్ స్టార్ నాని, జాతీయ నటి కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలలో నటించిన దసరా సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంలో చిత్ర బృందం అంతా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తెలంగాణా గ్రామీణ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో ఇప్పటికే సూపర్ హిట్‌గా నిలిచిన చమ్కీల అంగీలేసి పాటకు పలువురు డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో పెడుతున్నారు. మాజీ నటి, కీర్తి తల్లి మేనక కూడా కీర్తి సురేశ్‌కు గిఫ్ట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని ఈ పాటకు డ్యాన్స్ చేసి, కీర్తి లాగానే అదరగొట్టే స్టెప్పులేశారు.
దీనిని ఇన్‌స్టాలో షేర్ చేశారు. కీర్తి సోదరి భర్త కూడా మేనకతో కలిసి తమిళ వెర్షన్‌కు డాన్స్ చేశారు. మరోవైపు కీర్తి సురేశ్ గ్రామీణ నేపథ్యంలోని పక్షులు, జంతువులతో కలిసి సరదాగా ఆడుతూ పోస్టు పెట్టారు.