కేసీఆర్‌కు ఓట్లపై ఉన్న ప్రేమ.. ప్రజలపై లేదన్న ఈటల
దేశ చరిత్రలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ తన 16మంది మంత్రులు, 80మంది ఎమ్మెల్యేలతో గొర్లమందపై తోడేళ్లు దాడి చేసినట్లు…మునుగోడుపై పడ్డారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. చండూరు మండలం బంగారిగడ్డలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను గాలికొదిలేసి, ప్రజా సమస్యలు పట్టించుకోకుండా మునుగోడుపై పడ్డారని ధ్వజమెత్తారు. ఈ రోజు టీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత స్వేచ్ఛ హరిస్తునారన్నారు. గట్టుప్పల్ మండలమిచ్చినా, 10 లక్షల మందికి పింఛన్లు ఇచ్చినా, మద్యం దావత్‌లు ఇచ్చినా మునుగోడులో గెలవలేమనే విషయం టీఆర్ఎస్‌కు అర్థమైందని అందుకే కేసీఆర్ తోండి చేసి గెలవాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్‌కు ఓట్లపై ఉన్న ప్రేమ.. ప్రజలపై లేదని ఈటల మండిపడ్డారు.

