NewsTelangana

కేసీఆర్‌ నైతికంగా ఓడిపోయారు

టీఆర్‌ఎస్‌ పార్టీ, సీఎం కేసీఆర్‌ నైతికంగా ఓడిపోయారని బీజేపీ అగ్రనేత ఈటల రాజేందర్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, మల్లారెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి ప్రచారం చేసిన గ్రామాల్లోనూ.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి సొంత గ్రామంలోనూ బీజేపీ ఆధిక్యత సాధించడమే దీనికి నిదర్శనమన్నారు. సర్వే సంస్థల అంచనాలకు అందని రీతిలో ఫలితాలు రానున్నాయని చెప్పారు. ఓటర్లకు రాజగోపాల్‌ రెడ్డి బంగారం పంచుతారని అనడం ధర్మమా..? అని ప్రశ్నించారు. ముమ్మాటికి బీజేపీ గెలుస్తుందని.. కేసీఆర్‌ అహంకారం ఓడిపోతుందని జోస్యం చెప్పారు.