కేసీఆర్ హఠావో-తెలంగాణా బచావో: రాహుల్ గాంధీ
తెలంగాణా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాగా ఇటీవల కాలంలో మాజీ మంత్రి జూపల్లి ,మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడారు. దీంతో అప్పటినుంచి వారు ఏ పార్టీలో చేరతారని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జూపల్లి,పొంగులేటి కాంగ్రెస్ గూటికి చేరతామని ప్రకటించారు. ఈ మేరకు వారు ఈ రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటి అయ్యారు. కాగా ఈ భేటీ అనంతరం రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ మాట్లాడుతూ..తెలంగాణా కాంగ్రెస్‌లో ఘర్ వాపసీ జరుగుతోందని తెలిపారు. నేతలంతా తిరిగి కాంగ్రెస్‌లోకి రావడం ఆనందంగా ఉందని చెప్పారు. కేసీఆర్ హఠావో-తెలంగాణా బచావో నినాదంతో ముందుకు సాగాలని తెలంగాణా కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.