Home Page SliderTelangana

భూమి ఇవ్వకపోగా పేదలకు ఉన్న భూములను లాక్కున్న కేసీఆర్: ఈటల

సిద్దిపేట: దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన ఎస్సీ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూమి ఇవ్వకపోగా పేదలకు ఉన్న భూములను లాక్కున్నారని ఆరోపించారు. రూ.10 లక్షల పరిహారం ఇచ్చి.. రూ.కోట్లకు అమ్ముకున్నారని విమర్శించారు. కేసీఆర్ పేదలను కొట్టి పెద్దలకు ఇస్తున్నారు. పేద వాళ్లకు కోట్ల రూపాయలు విలువచేసే భూములు ఉండకూడదనే కేసీఆర్ అలా చేస్తున్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో అభివృద్ధి చేసి తన ఖాతాలో వేసుకుంటున్నారు. బీఆర్ఎస్ కండువా వేసుకోకపోతే.. వారిని తెలంగాణ గడ్డమీద బతకనివ్వం, కేసులు పెడతాం అని బెదిరించే పరిస్థితి ఏర్పడింది అని ఈటల వ్యాఖ్యానించారు.