NewsNews AlertTelangana

కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదు

కేసీఆర్ కుటుంబ పాలనకు బుద్ధి చెప్పేందుకే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. మళ్లీ మీ ముందుకు వచ్చానని భారీ మెజారిటీతో గెలిపిస్తారని నమ్మకంతోనే మళ్లీ పోటీ చేస్తున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మునుగోడు బహిరంగ సభలో మాట్లాడుతూ.. తాను ఢిల్లీ వెళ్లి అమిత్ షా గారిని కలిసి వచ్చి నప్పటి నుండి కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదన్నారు. నిన్నటి సభలో టిఆర్ఎస్ అభ్యర్థి సైతం ప్రకటించలేని దుస్థితిలో కేసీఆర్ ఉన్నారన్నారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మునంత కక్కించి తెలంగాణ ప్రజల కోసం ఖర్చు చేయడమే మోడీ సర్కారు లక్ష్యం అన్నారు. మునుగోడు ను అభివృద్ధి చేయలేని పదవి వద్దన్న ఉద్దేశంతోనే రాజీనామా చేశానన్నారు. ఇప్పుడు తనను భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్ ను ఇక్కడి నుంచే బొంద పెట్టాలని కోరారు.