కవితకు మరోసారి అస్వస్థత.. ఎయిమ్స్ కు తరలింపు
లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. గైనిక్ సమస్య, వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న కవితను అధికారులు వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కవితకు పరీక్షలు చేసి.. వైద్యులు ట్రీట్ మెంట్ చేశారు. ఎటువంటి ప్రమాదం లేదని జైలు అధికారులు తెలిపారు. అయితే.. ఇటీవల కవిత అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.. ఆమె తీవ్ర జ్వరం, నీరసంతో బాధపడ్డారు. కవిత కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత కవితను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు. లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన కవిత దాదాపు 155 రోజులు నుంచి జైలులో ఉన్నారు. ఆమె ఎన్నిసార్లు బెయిల్ కోసం అప్లై చేసినా కోర్టు బెయిల్ ఇవ్వలేదు.

