కర్ణాటక అభివృద్ధి డబుల్ ఇంజిన్‌తోనే సాధ్యం: మోదీ
కర్ణాటక ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఉన్న అధికార,ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచార భరిలో దిగాయి. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తుంది. కాగా ఇప్పటికే బీజేపీ ప్రముఖ నేతలు ఈ ప్రచారంలో పాల్గొని విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ కూడా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో BJP శ్రేణులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వచ్చే నెలలో కర్ణాటకలో జరగబోయే ఎన్నికలలో బీజేపీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా కర్ణాటక రాష్ట్ర అభివృద్ధి డబుల్ ఇంజిన్‌తోనే సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. కర్ణాటక రాష్ట్ర 25 ఏళ్ల భవిష్యత్తు,అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్తున్నామని మోదీ తెలిపారు. అంతేకాకుండా కర్ణాటక రాష్ట్రంలో బీజేపీకి ప్రజల నుంచి అపారమైన మద్దతు ఎప్పటికీ లభిస్తుందని ఆశిస్తున్నామని మోదీ వెల్లడించారు.

