కన్నడ నటుడికి బెయిల్ మంజూరు
కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు హత్య కేసులో ఊరట లభించింది. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టైన అతడికి కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. సర్జరీ కోసం ఆరువారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ ఈ రోజు ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, నటి పవిత్రగౌడ సహా 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పవిత్ర గౌడకు సంబంధించిన అసభ్యకర ఫొటోలు పంపించాడన్న ఆరోపణల్లో దర్శన్ అండ్ టీం రేణుకాస్వామిని బెంగళూరుకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేసిందని విచారణలో తేలింది. నిందితులంతా ప్రస్తుతం బెంగళూరులోని వివిధ జైళ్లలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

