ప్రియాంక గాంధీకి కంగనా రనౌత్ రిక్వెస్ట్
బీజేపీ ఎంపీ, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ డైరక్షన్ చేసి, నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ చిత్రాన్ని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రం అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఎట్టకేలకు త్వరలో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని చూడాలంటూ తాను ఇందిరాగాంధీ మనవరాలు ప్రియాంక గాంధీని కోరినట్లు తాజా ఇంటర్యూలో కంగనా రనౌత్ తెలిపారు. దానికి ఆమె ట్రై చేస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం ప్రియాంకకు నచ్చుతుందని, ఈ చిత్రంలో ఇందిరాగాంధీ పాత్రను ఎంతో మర్యాదపూర్వకంగా చూపించామని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో దేశంలోని పరిస్థితులను ప్రేక్షకులకు చూపించే ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని తీశామని, సెన్సార్ కట్స్ వల్ల చరిత్రకు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ మిస్సయ్యాయని తెలిపారు. కానీ కథపై ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొన్నారు.