ఎమర్జెన్సీ రిలీజ్‌కి ముందు ఫ్యాన్స్‌కి కంగనా రనౌత్ విజ్ఞప్తి
ఈ సినిమా ఫ్యాన్స్ చూడకుండా నిషేధించవద్దు. నటి-రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ తన ఫ్యాన్స్‌కు ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేసింది, రిలీజయ్యే ముందు తన రాబోయే సినిమా ఎమర్జెన్సీని ఫ్యాన్స్ చూడకుండా బహిష్కరించవద్దని వారిని కోరారు. కంగనా సొంతంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి సెన్సార్ బోర్డు అనుమతి నిచ్చింది. సినిమాని నిషేధించే ముందే ఫ్యాన్స్ చూడాలని కంగనా వీక్షకులను అభ్యర్థించింది. ఎమర్జెన్సీ సినిమా విడుదల తేదీని కంగనా త్వరలో ప్రకటిస్తారు. నటి-రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ తన పీరియడ్ పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ విడుదలకు ముందు అభిమానులకు ప్రత్యేక రిక్వెస్ట్ పెట్టింది. ప్రేక్షకులు బయట జరిగే సంఘటనలకు లొంగిపోకుండా తమ సొంత అభిప్రాయాలను కలిగి ఉండాలని కోరింది. ఎమర్జెన్సీ ఒక ప్రామాణికమైన సినిమా, అందులోని సంఘటనలు ప్రజలను రెచ్చగొడుతుంటే, అప్పుడు సినిమాపై నిర్ణయం తీసుకోవాలి తప్ప, ఎవరూ సినిమాని చూడకుండానే బ్యాన్ చేయకండి, అది అంత మంచిపని కాదు అని కంగనా పేర్కొంది.
జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేతో సహా తన చిత్రంలో వివాదాస్పద చారిత్రక వ్యక్తుల పాత్రను స్పృశిస్తూ, కంగనా ఇతర సినిమాలు విడుదలకు ముందు ఇలాంటి సవాళ్లను కూడా ఎదుర్కొన్నాయని, కానీ చివరికి రీలీజైందని పేర్కొంది. “భింద్రన్‌వాలే ఉగ్రవాది అని మీరు నమ్మితే, నా సినిమా ఇంకా విడుదల కాలేదు కదా. నా సినిమాకు మద్దతుగా నేను ఒక్కర్తినే ఉన్నాను’’ నాకు ఎవ్వరి సపోర్టు లేదు అని ఆమె తేల్చిచెప్పింది. బెదిరింపులను ఎదుర్కొన్నప్పటికీ, మద్దతునిచ్చి విజయవంతంగా విడుదల చేసిన పద్మావత్, ఉడ్తా పంజాబ్ వంటి చిత్రాలతో తన అనుభవానికి భిన్నంగా పరిశ్రమ మద్దతు లేకపోవడంపై కంగనా నిరాశకు గురైంది. పద్మావత్, ఉడ్తా పంజాబ్ వంటి సినిమాలు అన్నీ బెదిరింపుల తర్వాత కూడా బాగానే రిలీజ్ చేశారు, కానీ నా సినిమా విషయానికి వస్తే, ఎవరూ ముందుకు రాలేదు, ఎంకరేజ్ చేయడం లేదు. నేను పూర్తిగా ఇండిపెండెంట్‌నై పోయాను, అంటూ ఆమె ముగించింది.
ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, దివంగత సతీష్ కౌశిక్ కూడా నటించారు. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాకి సంగీతాన్ని సంచిత్ బల్హార, అంకిత్ బల్హార, జి.వి. ప్రకాష్ కుమార్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: రితేష్ షా. ముందుగా సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. అయితే విడుదల అనివార్య కారణాలతో వాయిదా పడింది.

