కమల దళం.. నగరానికి అగ్రనేతల రాక
హైదరాబాద్: నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తవడంతో బీజేపీ ప్రచారంపై దృష్టిసారించింది. అగ్రనేతలు నగరానికి రానున్నారు. ఒక్క కూకట్‌పల్లి మినహా రాజధాని పరిధిలోని 29 నియోజకవర్గాల్లో 28 చోట్ల కమలం అభ్యర్థులు బరిలో ఉన్నారు. సీట్ల కేటాయింపులో కాస్త ఇబ్బందులు ఏర్పడినా.. తర్వాత పరిణామాలు పార్టీకి నష్టం కలిగించకుండా అగ్ర నాయకత్వం చర్యలు తీసుకుంటోంది. రెబల్స్ లేకుండా బీజేపీ జాగ్రత్త పడింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు.

