crimeHome Page Sliderindia-pak warInternationalNews Alert

‘పాక్ ఇంటెలిజెన్స్‌తో టచ్‌లో ఉన్నా’..జ్యోతి మల్హోత్రా

పాక్‌కు గూఢచర్యం కేసులో అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాక్ ఇంటెలిజనెన్స్ అధికారులతో తనకు సంబంధాలున్నాయని, వారితో నిత్యం టచ్‌లో ఉంటానని అంగీకరించినట్లు సమాచారం. పాక్ హైకమిషన్‌లో పనిచేసే డానిష్ 2023లో తాను వీసా కోసం వెళ్లిన సమయంలో పరిచయమయ్యాడని పేర్కొంది.  పాక్ సరిహద్దు రాష్ట్రాలలో మిస్సైల్స్ నుండి రక్షణ కోసం ప్రభుత్వం నిర్వహించిన బ్లాక్ అవుట్ సమాచారాన్ని కూడా ఆమె డానిష్‌కు చెప్పినట్లు సమాచారం. ఆమె నుండి మూడు సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌ట్యాప్ స్వాధీనం చేసుకున్న దర్యాప్తు బృందం వాటిని పరిశీలించారు. వాటిలో కొన్ని సంచలన విషయాలు వెల్లడయ్యాయి. దానిలో ఆమెకు పాక్‌పై ఉన్న వల్లమాలిన ప్రేమ, అభిమానం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ చాలా క్రేజీగా, కలర్‌ఫుల్‌గా ఉన్నట్లు వర్ణించింది. గతంలో డానిష్ గజాలా అనే మహిళను కూడా ట్రాప్ చేసినట్లు తెలిసింది. ఇలాగే పాక్ వీసా కోసం వచ్చే వారిని ట్రాప్ చేసి గుఢచర్యానికి వాడుకునేవాడని నిర్ధారించారు ఎన్‌ఐఏ అధికారులు.