ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తో పాటు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టు న్యాయమూర్తులు న్యాయవాదులు, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటల లోపు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కు పలువురు రాష్ట్ర ప్రముఖులు ఘన స్వాగతం పలికారు.