బద్వేల్ ఘటనపై జగన్ ట్వీట్
బద్వేల్‌లో ఇంటర్ కాలేజీ విద్యార్థినిపై పెట్రోల్ దాడి ఘటనపై వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందన్నారు. ఇదేమి రాజ్యం చంద్రబాబు అంటూ ఎక్స్ ఖాతాలో ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోతోందని, ప్రతిరోజూ అత్యాచారాలు, వేధింపులు సాధారణమై పోయిందని విమర్శించారు. తమ ప్రభుత్వ కాలంలో బాలికలు, మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన దిశ చట్టాన్ని నీరుగార్చారని, రాజకీయ కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. ఈ యాప్‌ను 1.56 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని, దిశ కార్యక్రమాన్ని బలోపేతం చేశామని, కానీ ఇప్పుడు వీటిని నిర్వీర్యం చేశారని నిలదీశారు.