Andhra PradeshHome Page Slider

వైసీపీ కార్యాలయం కూల్చివేతపై జగన్ ట్వీట్

ఏపీలో ఇవాళ తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని CRDA అధికారుల కూల్చివేసిన విషయం తెలిసిందే. కాగా దీనిపై మాజీ సీఎం జగన్ స్పందించారు. ఈ మేరకు జగన్ దీనిపై ట్వీట్ చేశారు. “చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారు. తన దమనకాండను మరోస్థాయికి తీసుకుళ్లారు. చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు. దాదాపు పూర్తైయిన కార్యాలయాన్ని కూల్చివేశారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. ఐదేళ్ల పాలన ఎలా ఉండబోతుందనే దానికి..ఈ ఘటన ద్వారా హింసాత్మక సందేశం ఇచ్చారు. బెదిరింపులకు,కక్ష్యసాధింపు చర్యలకు భయపడేది లేదు.ప్రజల తరుపున ప్రజల కోసం గట్టిగా పోరాటం చేస్తాం. చంద్రబాబు దుశ్చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి” అని జగన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.