పెండింగ్ పనులపై జగన్ సమీక్ష
గుంటూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పనులు గురించి సీఎం జగన్ జిల్లా కలెక్టర్స్ , ఎమ్మెల్యేలతో క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. జిల్లాలో ఎన్నో సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు వాటి పనుల అవరోధాలకు గల కారణాలపై చర్చలు జరిపారు. యుద్ధప్రాతిపాదికన పనులు పూర్తి చేసే దిశగా కార్యాచరణ జరగాలని అధికారులును ఆదేశించారు. అందరు సమన్వయంగా పని చేస్తూ జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు.