అమరవీరుని కుటుంబానికి జగన్ ఆర్థిక సాయం..
ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా దేశరక్షణలో పాకిస్థాన్ మూకలతో తలపడి వీరమరణం పొందిన అమరవీరుడు మురళీనాయక్ కుటుంబాన్ని వైసీపీ నేత జగన్ పరామర్శించారు. ఆయన తల్లిదండ్రులు శ్రీరాం నాయక్, జ్యోతిబాయిని పరామర్శించారు. ఆ కుటుంబం బాధ ఎవరూ తీర్చలేనిదని, దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందిన మురళీ త్యాగానికి దేశం యావత్తూ రుణపడి ఉందన్నారు. ఆయన కుటుంబానికి వైసీపీ పార్టీ తరపున రూ. 25 లక్షల సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు జగన్. ఆయన కుటుంబానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.