Andhra PradeshHome Page Slider

34.5 కోట్లతో 146 నయా అంబులెన్స్‌లు ప్రారంభించిన జగన్

వైద్యరంగాన్ని మరింత బలోపేతం చేస్తూ 146 కొత్త అంబులెన్స్‌లను ప్రారంభించారు ఏపీ  సీఎం జగన్‌. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వద్ద సీఎం జగన్ 146 కొత్త 108 అంబులెన్స్‌లను సోమవారం నాడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ నూతన అంబులెన్స్‌లకు గానూ రాష్ట్ర ప్రభుత్వం రూ.34.79 కోట్లను ఖర్చు చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 768 అంబులెన్స్‌లు ప్రజలకు సేవలు అందిస్తున్నాయని, మరమ్మతులకు గురవుతున్న వాటి స్థానంలో కొత్త అంబులెన్స్‌లు సేవలు అందించనున్నాయి అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. నూత‌న అంబులెన్స్‌ల్లో ఉన్న అధునాతన వైద్యసౌకర్యాలను ప‌రిశీలించి వాటిలో కల్పించిన వైద్య సదుపాయాల గురించి అధికారులు సీఎం జగన్ కు వివరించారు. “జగనన్న ప్రభుత్వం 108 అంబులెన్స్‌ సేవలను మరింత బలోపేతం చేసింది. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషాశ్రీచరణ్, రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా), ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.